//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అనుష్క సినిమా అయిపోయిన‌ట్టేనా.. సినీ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్న‌ గుస‌గుస‌లు..!

Category : movies

టాలీవుడ్ జేజెమ్మ‌, స‌రోజ‌, దేశ‌సేన ఇలా చెప్పుకుంటూ పోతే.. అనుష్క అనేక పాత్ర‌ల్లో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది. అక్కినేని నాగార్జున సూప‌ర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అనుష్క‌.. బ‌డా హీరోల‌కు ధీటుగా లేడీ ఓరియంట‌డ్ చిత్రాల్లో కూడా న‌టించి మెప్పించింది. దాదాపు ద‌శాబ్ద‌కాలం పైనే టాప్ హీరోయ‌న్‌గా కొన‌సాగిన అనుష్క బాహుబ‌లి, భాగ‌మ‌తి చిత్రాల త‌ర్వాత ఒక్క చిత్రానికి కూడా సైన్ చేయ‌లేదు.

గ‌త రెండేళ్ళ‌గా అనుష్క పై పెళ్లి వార్తలు జోరుగా సోష‌ల్ మీడియాలో ట్రాల్ అయ్యాయి. అయితే అవి షోష‌ల్ మీడియా పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే మ‌రోసారి అనుష్క గురించి ఒక షాకింగ్ మ్యాట‌ర్ సోషల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. అనుష్క సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసింద‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని మ‌రో ఇన్నింగ్స్ మొద‌లు పెట్ట‌బోతోంద‌నే వార్త తాజాగా సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం రేపుతోంది. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ప‌దేళ్ళ పాటు కోన‌సాగ‌డ‌మే చాలా క‌ష్టం.. అలాంటింది అనుష్క ఏకంగా దాదాపు ప‌దేళ్ళకు పైగానే నెంబ‌ర్ వ‌న్‌ హీరోయిన్‌గా కొన‌సాగింది. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్లు దూసుకు వ‌స్తున్న నేప‌ధ్యంలో ద‌ర్శ‌క, నిర్మాత‌లు కూడా కొత్త‌వాళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేప‌ధ్యంలో అంటే ఏ పాత్ర దొరికితే ఆ పాత్రలు చేసి వైఫల్యాలు మూటకట్టుకోవటం కన్నా.. విజ‌యాలు ఉన్న‌ప్పుడే గౌరవపద్రంగా వైదొలగటం మంచిద‌ని.. ఇక వెండితెర పై అనుష్క సినిమా అయిపోయిన‌ట్టేన‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.