ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అతడు ఆడలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్‌ను అతని ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కలిసింది.
దీని కోసమే అనుష్క బెంగళూరుకు వెళ్లి అతడి గాయం తీవ్రత, ఫిట్నెస్తో పాటు ఇతర విషయాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. దాంతో వీరిద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చికిత్సలో భాగంగా వైద్యుడి వద్దకు ఫిజియోథెరపి కోసం వెళ్లి.. బయటకు వస్తున్న విరాట్‌తో పాటు అనుష్క కూడా ఉంది. అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లినట్లు ఫొటోల్లో తెలుస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు ఏప్రిల్ 14 నుంచి మైదానంలో అడుగుపెట్టబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంకేతాలిచ్చాడు విరాట్. కోహ్లి-అనుష్క ఒక్కటైనప్పటి నుంచి విరాట్ ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు చాలాసార్లు వచ్చిన సందర్భాలున్నాయి. విరాట్ మైదానంలో చెలరేగితే చూడాలని అభిమానులతో పాటు అనుష్క కూడా కోరుకుంటున్నట్లుంది.