//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర మంత్రిని కూడా వేధించారు

Category : national politics

సోమవారం అర్ధరాత్రి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ ఈవ్‌టీజింగ్‌కు గురయ్యారు. ఆమెను ముగ్గురు దుండగులు వేధించారు. తనకు జరిగిన ఈ ఘటనపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళితే అనుప్రియ తన నియోజకవర్గం మీర్జాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వారణాసి వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఔరాయ్, మీర్జామురాద్ మధ్య కారులో ప్రయాణిస్తుండగా నంబరు ప్లేట్ లేని కారులో వచ్చి తన వాహన శ్రేణిని దాటేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

తన భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, తన భద్రతా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. అనుప్రియ పటేల్ ఈ ఫిర్యాదును వారణాసి ఎస్ఎస్‌పీ ఆర్ కే భరద్వాజ్‌కు సమర్పించారు. భరద్వాజ్ తక్షణమే స్పందించి, నిందితుల కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు ఈ దుండగులను అరెస్టు చేసి, వారి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related News