Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తండ్రితో జతకడుతున్న కొడుకు హీరోయిన్....

Category : movies

ఈ మధ్య నాగార్జున ముల్టీస్టార్ మూవీలకు సై అంటున్నాడు. తాజాగా నానితో కలిసి దేవదాస్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఓ తమిళ మల్టీస్టారర్‌లో నటించేందుకు ఓకె చెప్పారు నాగార్జున. తమిళ హీరో ధనుష్ దర్శకత్యం వహిస్తూ నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమాలో నాగార్జున మరో హీరోగా నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండళ్‌ ఫిలింస్‌ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా అదితిరావ్‌ హైదరీని తీసుకోగా మరో హీరోయిన్‌ పాత్రకు అను ఇమ్మాన్యూల్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన ఆమె, వెంటనే నాగ్ సినిమాలో నటిస్తుండటంతో కొడుకు హీరోయిన్ తండ్రితో నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రోనాల్డ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌, ఎస్‌జే సూర్యలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News