//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐదు రోజుల్లో రెండు సార్లు ఎవ‌రెస్ట్‌ అధిరోహించిన మహిళ

Category : national

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన పర్వతోహకురాలు అన్షు జ‌మ్‌సేన్పా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన శిఖ‌రం ఎవ‌రెస్ట్‌ను ఐదు రోజుల్లో రెండుసార్లు అధిరోహించిన ఏకైక‌ మ‌హిళ‌గా నిలిచింది. 

ఆదివారం ఉద‌యం 7.45 గంట‌ల‌కు ఆమె ఎవ‌రెస్ట్‌పైకు  చేరింది. ఈ శిఖ‌రాన్ని అధిరోహించ‌డం మొత్తం మీద ఆమెకు ఇది ఐదోసారి కాగామే 16 త‌ర్వాత రెండోసారి కావ‌డం విశేషం. శ‌నివారం ఉద‌యం బేస్‌క్యాంప్ నుంచి ఎవ‌రెస్ట్ ఎక్క‌డం మొద‌లుపెట్టింది 32 ఏళ్ల అన్షు. 

2011లో తొలిసారి ఎవ‌రెస్ట్‌ను ఎక్కిందామె. త‌ర్వాతి ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి ఆ సాహసం చేసింది. 2013 మే 18న మూడోసారి ఎవ‌రెస్ట్‌ను జ‌యించింది. ఐదు సార్లు ఎవరెస్టు అధిరోహించిన తొలి భారతీయ మహిళ కూడా ఆమె కావడం విశేషం. 

మ‌రోసారి భార‌త ప‌తాకాన్ని ఎవ‌రెస్ట్‌పై ఎగ‌రేయ‌డ‌మే నా ల‌క్ష్యం.. దేశంలోని పౌరులంద‌రి ఆశీర్వాదాలు కావాలి అని ఐదోసారి ఎవ‌రెస్ట్ ఎక్కే ముందు అన్షు కోరింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన అన్షును అరుణాచ‌ల్ ముఖ్యమంత్రి  పెమా ఖండు అభినందించారు.