//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ లుక్ ఇదే...

Category : movies

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యన్‌టిఆర్’ బయోపిక్‌'. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ANR first Look in NTR Biopic

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పనిచేసిన నటి నటులు కూడా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన ముద్దుల మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈరోజు ఏఎన్నార్‌ 94వ జయంతి. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఏఎన్నార్‌ లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసాడు సుమంత్‌.ANR first Look in NTR Biopic

పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. సినిమాలో ఇది నా లుక్‌’ అంటూ సుమంత్‌ ట్వీట్‌ చేశారు. ఈ పిక్ చూస్తుంటే ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్ పరకాయ ప్రవేశం చేసినట్టు ఉన్నాడు. అదే తలకట్టు, మీసం, కళ్లజోడు, చూపుతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ వెళ్లేటప్పుడు తాతగారు వాడిన ఆఖరి కారులోనే సెట్స్‌కు వెళ్లినట్లు తెలిపారు సుమంత్‌.ANR first Look in NTR Biopic

వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్‌ అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన దగ్గుబాటి రానా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ రెండు పిక్స్ చుసిన అభిమానులు షాక్ గురువుతున్నారు. అచ్చం వారిని చూసినట్టే ఉందని అనుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ బాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది.