డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ముంబై ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో 5 మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యారు. ఈ సమయం లో వారికీ ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి.
ఇలాంటి తరుణం లో ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. ఓపెనర్లు లూయిస్ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) మెరుపులకు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 నాటౌట్) బాధ్యతాయుత అర్ధ సెంచరీ జత కలవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది.
ఏడు మ్యాచ్‌ల్లో ఈ జట్టుకిది రెండో విజయం కాగా చెన్నైకిది రెండో పరాజయం. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 169 పరుగులు చేసింది. రైనా (47 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 నాటౌట్), అంబటి రాయుడు (35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా ధోనీ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) ఫర్వాలేదనిపించాడు.
ఐపీఎల్లో ధోనీకిది 150వ మ్యాచ్ కావడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో రెండు వికెట్లకు 170 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మకి దక్కింది.