//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో రైలు పట్టాలు తప్పింది.

Category : national

కొద్ది వారాల క్రితం తీవ్ర ఆందోళనకు గురిచేసిన రైలు ప్రమాదాలను మరువక ముందే మరో రైలు పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని భైరంగి రైల్వే స్టేషన్ వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

ప్రమాద సమయంలో రైల్వే ట్రాక్‌పై మరమ్మతులు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది వారాల క్రితం ఉత్తర ప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో మధుర రైల్వే స్టేషన్ వద్ద ఓ గూడ్సు రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. తర్వాతి కొద్దిరోజులకే అచ్చెన్నెర-మధుర మార్గంలో మరో గూడ్సు రైలు కూడా ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి.