//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కి మరో షాక్ !

Category : politics

ఒకపక్క ప్రజాసంకల్ప యాత్ర పేరుతొ ఆంధ్ర ప్రదేశ్ అంతటా పాదయాత్ర చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్.మరో పక్క మాత్రం వైసీపీ నేతలు చిన్నగా టీడీపీ లోకి దూరిపోతున్నారు.ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఎంతోకీలక మైన తూర్పు గోదావరి జిల్లా లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతోంది అని రాజకీయ వర్గాల సమాచారం . కాకినాడ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో రెండు సార్లు ఓడిపోయిన కాపు నాయకుడు, యువ పారిశ్రామికవేత్త, వైసీపీ కీలక నేతగా చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం.

చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌ ముఖ్య అనుచరులు, అయన కార్యకర్తలు పార్టీ మారిపోదామని సునీల్ పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని అనుకుంటున్నారు, దీనితో పాటుగా వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు కూడా నచ్చకపోవడంతో పార్టీ మారిపోవాలని సునీల్ నిశ్చయించుకున్నారు .