//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షమీ కి మరో షాక్.....!

Category : sports

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య మీద తనకు వుండే ప్రేమను చూపిస్తుంటే, ఆమె మాత్రం అతన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఎప్పుడు హసీన్‌ జహాన్‌ షమీ పై మరో కేసు వేసింది. ఈ రోజు కోల్‌కతాలోని అలీపూర్‌ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద ఆమె పిటిషన్‌ నమోదుచేసింది. ఈ పిటిషన్‌లో తనకు, తన కూతురి పోషణకు, షమీ భరణం చెల్లించేలా కోర్ట్ ఆదేశాలివ్వాలని కోరింది.

తమ అకౌంట్‌ నుంచి డబ్బులు తీసుకోకుండా షమీ బ్యాంకులకు సూచనలిచ్చాడని జహాన్‌ ఆరోపణలు చేసింది. ఈ మధ్యే తాను చెక్‌ సాయంతో డబ్బుతీసుకోవాలని ప్రయత్నించానని, కానీ డబ్బులు రాలేదని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భరణం కోసం నేను కోర్టుకెక్కినట్లు తెలిపింది.

గతంలో షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఇంకా ఆమె షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసింది.

వీటిని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ వార్షిక వేతనాల్లో కాంట్రాక్టు ఇవ్వని బీసీసీఐ ఫిక్సింగ్‌ ఆరోపణల విచారనంతరం గ్రేడ్‌ బీ కాంట్రాక్టును పునరుద్దరించింది. జహాన్‌ విన్నపాన్ని తోసిపుచ్చిన బీసీసీఐ షమీకి ఐపీఎల్‌లో ఆడే అవకాశం కూడా కల్పించింది. ప్రస్తుతం షమీ ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం ఆడాడు . ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిన విషయం తెలిసిందే.

Related News