దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
భారత్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్‌లు దూరం కాగా, తాజాగా మరో కీలక ఆటగాడు క్వింటాన్ డీకాక్‌కు కూడా అర్థాంతరంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మణికట్టు గాయం కారణంగా మొత్తం భారత్‌తో సిరీస్ నుంచి డీకాక్ తప్పకున్నాడు.
మిగిలిన నాలుగు వన్డేలతో పాటు ట్వంటీ 20 సిరీస్‌కు డీకాక్ దూరం కానున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. డీకాక్ తిరిగి కోలుకోవడానికి రెండు వారాల నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
ఆ నేపథ్యంలో టీమిండియాతో ఓవరాల్ సిరీస్ నుంచి డీకాక్ వైదొలగాల్సి వచ్చింది. అయితే అతని స్థానంలో మరొక ఆటగాడ్ని ఇంకా ఎంపిక చేయలేదు.దక్షిణాఫ్రికా జట్టు కు దెబ్బమీద దెబ్బ తగులుతుంది.