టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తన ఖాతాలో మరో రికార్డు ను వేసుకున్నాడు. రైనా తాజాగా టీ-20ల్లో 50 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్స్ కొట్టి అంతర్జాతీయ టీ-20ల్లో 50 సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
రైనా అలాగే అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.నిదహాస్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా 28 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అందులో ఒక ఫోర్‌తోపాటు ఒక సిక్స్ కూడా ఉంది.
ఆ సిక్స్‌తో రైనా అంతర్జాతీయ టీ-20ల్లో తన 50వ సిక్స్‌ను పూర్తి చేసుకున్నాడు. రైనా కంటే ముందు యువరాజ్ (74 సిక్స్‌లు), రోహిత్ శర్మ (69 సిక్స్‌లతో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.