//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపికి మరో పార్టీ దూరం

Category : national politics

తమ వైఖరితో మిత్రపక్షాలను దూరం చేసుకుంటున్న బిజెపికి మరో పార్టీ షాక్ ఇచ్చింది. శివసేన ఎన్డియే నుంచి బయటకు వస్తుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ పార్టీ నేత ఉద్దావ్ థాకరే తో అమిత్ షా భేటి అయిన కొన్ని గంటలకే మరో పార్టీ షాక్ ఇచ్చింది. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) నుంచి వైదొలుగుతున్నట్టు బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రకటించింది.

సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా... ఇవాళ పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. గత కొంత కాలంగా ఎన్డియే కూటమిపై ఈ పార్టీ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీయే సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.