ఆవిష్కరించిన చైనా
ప్రపంచం లోనే అతిపెద్దదైన మరో నూతన విమానా శ్రయాన్ని చైనా ఆవిష్కరిం చింది. రూ. 78 వేల కోట్ల భారీ వ్యయంతో దీన్ని బీజింగ్‌లో నిర్మిస్తు న్నారు. ఈ విమానాశ్రయ సేవలు 2019 అక్టోబర్‌లో పూర్తి అందుబాటు లోకి వస్తాయి. 47 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించడానికి 52 వేల టన్నుల స్టీలు, 1.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ఆరంభంలో ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా ఏడాదికి 45 మిలియన్ల మంది ప్రయాణిస్తారని అంచనా. తర్వాత ఏటా 100 మిలియన్ల మందికి ఈ విమానాశ్రయం సేవలు అందించనుంది.