//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీబీఎల్‌లో మరో భారత క్రీడాకారిణి..

Category : sports

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి మరో భారత క్రీడాకారిణికి అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ లీగ్ లో ఇద్దరు భారత క్రీడాకారుణులు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఆడుతుండగా, తాజాగా ఇందులో ఆడేందుకు మరో భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది. బీబీఎల్ మహిళల మూడో ఎడిషన్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడేందుకు వేదా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వేద మాట్లాడుతూ.. బీబీఎల్ ఆడే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.