Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బంధువులే రాబందులై .. పిల్లలను కట్టేసి తల్లిపై సామూహిక అత్యాచారం

Category : state

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. బంధువులే ఆమె పాలిట రాబందులయ్యారు. తమమాట వినకుంటే పిల్లలను చంపేస్తామని బెదిరించి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత పాశవికంగా ఆమె పై లైంగిక దాడి చేశారు. పిల్లలను కట్టేసి, వారి ముందే తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు.

జల్‌పల్లి ముస్తఫా బస్తీకి చెందిన షాకీర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివసిస్తున్నారు. ఈ క్రమంలో షాకీర్ డ్యూటీకి వెళ్లడంతో భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమెపై కన్నేసిన బంధువులు అజాద్, అంజాద్‌లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో షాకీర్ ఇంటికి వచ్చారు. మంచినీరు అడగటంతో ఆమె నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది.ఆ లోపు వెనుక నుంచి ఆమెను బంధించారు. నలుగురు పిల్లలను మరో వ్యక్తి పక్క గదిలో ఉంచి గడియ పెట్టాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే పిల్లలను చంపేస్తామని బెదిరించారు సదరు కామాంధులు. అర్థరాత్రి విధులు ముగించుకుని వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని తెలిపింది.

దీంతో అతడు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.