//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర్జున్ రెడ్డి , RX 100 తరహాలో రానున్న మరో బోల్డ్ చిత్రం

Category : movies

మాములుగా బోల్డ్ చిత్రాలు హాలీవుడ్ లోను , Bollywood లోను సర్వసాధారణం గా వస్తుంనేవుంటాయి. ఎటువంటి సినిమాలు మన తెలుగు రావటం అనేది చాల అరుదు. ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమా మారుతుందో, తెలుగు సినిమా ప్రేక్షాకులు మారుతున్నారో తెలీదు గానీ బోల్డ్ కంటెంట్ సినిమాలు బాగా వస్తున్నాయి. అర్జున్ రెడ్డి పుణ్యమా అని బోల్డ్ కంటెంట్ సినిమాలకు డిమాండ్ పెరిగి పోయింది.

ఆ తరువాత చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది RX 100 మూవీ. రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పదిహేను కోట్లు రాబట్టి కార్తికేయ, పాయల్ రాజపుట్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. పాయల్ అందాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి యూత్ ని థియేటర్లకు రప్పించింది.

అదే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించిన నాటకం, రథం వంటి చిత్రాలు ఆ కోవలోకి చెందినవే. కానీ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇపుడు మరో బోల్డ్ కంటెంట్ తో రామ్ గోపాల్ వర్మ ప్రెసెంటేషన్ లో వస్తున్న చిత్రం భైరవ గీత. ధనుంజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సిద్దార్థ డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.నవంబర్ 22 న మూడు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.