గత ఐదు రోజులుగా బాంబు పేలుళ్లతో శ్రీలంక అదిరిపోతుంది . ప్రశాంతతకు మారుపేరులా ఎవరితో శత్రుత్వం లేకుండా నుండే శ్రీలంక దేశంపై బాంబు ల వర్షం కురుస్తోంది . గురువారం ఉదయం రాజధాని కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూగోడ పట్టణంలో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు . దాంతో ప్రజలు గందరగోళంలో పడ్డారు ... అయితే ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డార అన్న విషయం తెలియాల్సి ఉంది. ఆదివారం జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్ల తరువాత మరిన్ని పేలుళ్లు సంభవించాయి . అయితే మరిన్ని బాంబులు పేలే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు . బుధవారం ఒక సినిమా హాల్ ని లక్ష్యంగా చేసుకుని ఒక బైక్ లో బాంబు అమర్చారు , అది గ్రహించిన పోలీసులు దానిని తీసేసే ప్రయత్నం చేస్తుండగా అది పేలింది.
ఇప్పటివరకు శ్రీలంకలో జరిగిన బాంబు ఘటనకు మృతి చెందిన వారి సంఖ్య 321కి చేరింది, ఇంకా వందలమంది చికిత్య పొందుతున్నారు. ఇప్పటికే భారతదేశం నుండి ఎటువంటి సహాయం అయిన మేము చేయడానికి సిద్ధం అని మోడీ తెలియజేసారు.