//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేప్ కేసులో మరో బిజెపి ఎంపి

Category : national politics

ఉత్తరప్రదేశ్ లో మరో బిజెపి ఎమ్మెల్యే రేప్ కేసులో ఇరుక్కున్నారు. గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేసారని ఒక యువతీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం ఇప్పడు సంచలనంగా మారింది. ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడౌన్ జిల్లాలో బిసౌలీ బీజేపీ ఎమ్మెల్యే కుషాగ్ర సాగర్ తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని 22 ఏళ్ల యువతి బడౌన్ జిల్లా ఎస్పీ కళానిధికి ఫిర్యాదు చేసింది.

తన తల్లి గ్రీన్ పార్కు ప్రాంతంలో నివాసముంటూ ఇళ్లలో పనులు చేస్తుంటుందని బాధిత యువతి పేర్కొంది. తాను పదహారేళ్ల వయసులో ఉన్నపుడు 2012వ సంవత్సరంలో తన తల్లితో పాటు కలిసి కుషాగ్ర సాగర్ ఇంటికి వెళ్లానని, అప్పుడు అతను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి అత్యాచారం చేశాడని, 2012 నుంచి 2014 వరకు కుషాగ్ర సాగర్ తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని, ఇప్పుడు ఎమ్మెల్యే జూన్ 17వతేదీన మరో యువతిని పెళ్లాడనున్నాడని యువతి వెల్లడించింది.

దీనిపై ఎస్పి స్పందించారు...ఈ ఫిర్యాదుపై సర్కిల్ పోలీసు అధికారి నీతి ద్వివేదితో ప్రత్యేక దర్యాప్తు చేపిస్తున్నానని, నివేదిక వచ్చాక ఎమ్మెల్యే నిందితుడని తేలితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ కళానిధి చెప్పారు.కాగా బాధిత యువతి 2014లో పోలీసులకు ఫిర్యాదు చేయగా రూ.10లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చుకున్నానని, అప్పుడు కుదుర్చుకున్నరాజీపత్రాన్ని ఎమ్మెల్యే కుషాగ్ర సాగర్ పోలీసులకు సమర్పించారు. ఇదిలా ఉంటె ప్రస్థుతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుషాగ్ర సాగర్ తండ్రి అయిన మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్ 2008లో ఓ మహిళపై అత్యాచారం, మరో హత్య కేసులో జైలులో ఉండటం గమనార్హం.