టీం ఇండియా సారధి విరాట్ కోహ్లికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అంతర్జాతీయ ఆటగాళ్లకు అందించే పాలి ఉమ్రీగర్ అవార్డును టీం ఇండియా సారధి దక్కించుకున్నాడు. 2016-17, 2017-18 సీజన్లలో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డు కింద కోహ్లీ రూ.30 లక్షలు (ఏడాదికి రూ.15 లక్షల చొప్పున) అందుకోనున్నాడు.
దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు వయస్సుతో సంబంధం లేకుండా అవార్డులకు ఎంపిక చేసింది బోర్డు. 2016-17, 2017-18 సీజన్లలో మహిళల క్రికెట్లో బాగా రాణించినందుకుగాను హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానకు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును అందజేయనున్నారు. మొత్తం 18 విభాగాల్లో బీసీసీఐ అవార్డులు ప్రకటించింది.
అవార్డులు దక్కించుకున్న ఇతర ఆటగాళ్ళ వివరాలు ఒక్కసారి చూస్తే
2016-17 సీజన్:
* కృనాల్ పాండ్య- లాలా అమర్నాథ్ అవార్డు(దేశవాళీ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా రాణించినందుకు)
* పర్వీజ్ రసూల్(జమ్ము& కశ్మీర్) - లాలా అమర్నాథ్ అవార్డు(రంజీ ట్రోఫీలో ఆల్‌రౌండర్‌గా రాణించినందుకు)
* ఠాకూర్ తిలక్ (హైదరాబాద్) - జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్-16 విజయ్ మర్చంట్ టోర్నీలో అత్యధిక స్కోరు)
* పూనమ్ రౌత్ - జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ
2017-18 సీజన్:
* మయాంక్ అగర్వాల్ - మాధవరావు సింథియా అవార్డు (రంజీ ట్రోఫీలో అత్యధిక స్కోరు)
* ఆర్యమన్ బిర్లా(కుమార మంగళం బిర్లా తనయుడు) - ఎమ్ఎ చిదంబరం ట్రోఫీ
* కె. నితీశ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) - జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ