ఆసిస్ ఆటగాళ్ళకు ఈ ఏడాది ఐపియల్ ఎంత మాత్ర౦ కలిసి రావడం లేదు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఆ జట్టు ఆటగాళ్ళు స్టీవ్ స్మిత్ , డేవిడ్ వార్నర్ ఐపీల్ కి దూరమవగా గాయాల కారణంగా మరికొందరు ఆటగాళ్ళు దూరమయ్యారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు ఆటగాడు కమిన్స్ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన కూడా చేసింది.
ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు మరో ఆటగాడు పాట్ కమిన్స్ కూడా గాయం కారణంగానే ఈ టోర్నీ ఆడలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో కమిన్స్‌కు గాయమైంది. స్కానింగ్ నిర్వహిస్తే గాయం తీవ్రమైందని తెలింది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కొద్ది వారాల తర్వాత మరోసారి స్కానింగ్ నిర్వహిస్తాం. ఈ కారణంగానే అతడు ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది అని పేర్కొంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించిన వేలంలో కమిన్స్‌ను ముంబయి ఇండియన్స్ రూ.5.4కోట్లకు దక్కించుకుంది.