//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జిల్లాలో జూన్ ఒకటి నాటికి అన్న క్యాంటిన్లు

Category : district state

కర్నూలు జిల్లాలో అన్న క్యాంటీన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని.. పనులు వేగంగా సాగుతున్నాయని.. జూన్‌ ఒకటో తేదీ నాటికి వాటిని పూర్తి చేస్తామని ప్రజారోగ్యశాఖ ఈఈ శేషసాయి వెల్లడించారు. మంగళవారం ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. పిల్లర్లు, గోడలు ఇతర పనుల నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆదోనిలో మూడు, ఎమ్మిగనూరు రెండు, కర్నూలు ఎనిమిది, నంద్యాల మూడు, డోన్‌లో ఒకటి చొప్పన అన్న క్యాంటీన్లు నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కదాని నిర్మాణానికి రూ.63 లక్షలకుపైగా వ్యయం అవుతుందన్నారు. నిర్ణిత సమయంలోగా వీటిని పూర్తి చేసి అప్పగిస్తామని వివరించారు.