Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుకుమార్ ని పక్కన పెట్టి ...అనిల్ రావిపూడి సినిమా ఎందుకు ఒకే చేసాడు మహేష్ బాబు.

Category : movies

తాజాగా మహేశ్ బాబు తన కెరీర్ లోనే 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.ఇందులో మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు.హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకోవడంతో, తన తదుపరి సినిమాపై మహేశ్ బాబు దృష్టి పెట్టాడు. సుకుమార్ తో తన తదుపరి సినిమా చేయాలని మహేశ్ బాబు భావించాడు. అయితే సుకుమార్ సిద్ధం చేసిన కథ నచ్చకపోవడంతో, ఆయన మరోలైన్ వినిపించి ఓకే చేసుకున్నాడని సమాచారం.

ఈ కథకి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి తనకి 6 నెలలు సమయం కావాలని సుకుమార్ అడగడంతో, ఈ లోగా మరో దర్శకుడితో మరో సినిమా చేసేయాలనే నిర్ణయానికి మహేశ్ బాబు వచ్చేశాడని సమాచారం. అంతే కాకుండా మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ దూకుడు సినిమాకి రైటర్ గా పని చేసిన అనిల్ రావిపూడి.... ప్రస్తుతం దర్శకుడి గా సూపర్ హిట్స్ ఇస్తున్న నేపథ్యంలో ఆయన తో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.అయితే గతంలోనే మహేష్ కి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు.

పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి రంగంలోకి దిగిపొమ్మని ఆయనతో మహేశ్ బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఆ పనిలోనే వున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్.అయితే ఇపుడు సుకుమార్ సినిమా పెండింగ్ లో ఉన్న తరుణంలో అనిల్ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.