//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లే

Category : sports

వరుస విజయాలతో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపైన అనిల్ కుంబ్లే  భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి  తప్పుకున్నాడు.సలహాదారుల కమిటీ అతన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపినా కెప్టెన్  పదవిలో కొనసాగకూడదని కుంబ్లే నిర్ణయించుకున్నాడు అని బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.  విరాట్ కోహ్లీ, మరో కొందరు సీనియర్ ఆటగాళ్ల ధోరణితో విసుగు చెంది రాజీనామా చేయడం ద్వారా వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. 

మరో మూడు రోజుల్లో విండీస్ పర్యటన మొదలుకానున్న నేపథ్యంలో అతను ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలేంటో బహిర్గతం కావాల్సి ఉంది. వాస్తవానికి కుంబ్లే ఏడాది కాంట్రాక్ట్ చాంపియన్స్ ట్రోఫీతో ముగిసినా విండీస్ టూర్ వరకు అతన్ని కొనసాగించేలా రెండు వారాల కిందటే బీసీసీఐ, సీఏసీ ఆమోద ముద్ర వేసింది. కానీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఐసీసీ వార్షిక సమావేశం కోసం లండన్‌లోనే ఉన్న కుంబ్లే విండీస్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు.


దీనికంటే ముందు లండన్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు పరిష్కరించలేని స్థాయికి చేరుకున్నాయని సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ బీసీసీఐకి సంకేతాలివ్వడంతో బోర్డు రంగంలోకి దిగింది. మంగళవారం జట్టు విండీస్‌కు బయలుదేరే ముందు విరాట్,  కుంబ్లేతో బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈవో రాహుల్ జోహ్రీ, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

కానీ ఈ సమావేశం అంత బాగా జరుగలేదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు కుంబ్లే రాజీనామాతో బీసీసీఐ తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. విండీస్ పర్యటనలో జట్టు పర్యవేక్షకుడిగా ఎంవీ శ్రీధర్‌ను నియమించింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు సంజయ్ బంగర్, ఆర్. శ్రీధర్‌లు తమ స్థానాల్లో కొనసాగుతారని తెలిపింది.

Related News