//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Category : politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్ ఫై నేరుగా మాట్లాడకపోయినా మీడియా కథనాలు, టీడీపీ నాయకుల వాగ్ధాటి చూస్తుంటే ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కేంద్రం సహాయం చేయకుంటే ఏం చేస్తాం నమస్కారం పెట్టి బయటకొస్తాం అని పోలవరానికి నిధుల కేటాయింపు వ్యవహారం సందర్భంగా చంద్రబాబు చెప్పారని వార్తలొచ్చాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం ప్రకటించే దిశలో ముందుకు వెళుతున్నారు. అంచెలంచెలుగా ఈ యుద్ధ ప్రక్రియ ఉంటుంది అని తెదేపా ఎంపీ టీజి వెంకటేష్ చెప్పారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారని టీడీపీ నేతలతో చర్చించి ఏ రాజకీయనిర్ణయం తీసుకుందాం అన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌పైనే సుదీర్ఘంగా చర్చించారు. శాఖల వారీగా కేటాయింపుల గురించి ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని కళా చెప్పారు. రాష్ట్రంలో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు. కాగా, బడ్జెట్‌ ప్రసంగంలో రాజధాని, రైల్వేజోన్‌, రెవెన్యూ లోటు అంశాల ప్రస్తావనే లేదని చెప్పారు. ఫిబ్రవరి 4న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందని. ఆ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తామని వెంకట్రావు తెలిపారు.

ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టే క్రమంలో చంద్రబాబు ఈ పర్యటనకు వెళుతున్నట్టు సమాచారం. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ కానున్నారు.

Related News