//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బడ్జెట్‌పై నిరసనగా ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపు

Category : politics

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు, ప్రజలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై చూపుతోన్న తీరుకి నిరసనగా ఈ నెల 8న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం హామీల్లో ఏ ఒక్కదానికీ బడ్జెట్ కేటాయింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించే చర్యలేవీ బడ్జెట్‌లో లేవని అన్నారు. పెరుగుతోన్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగే చర్యలేవీ కూడా బడ్జెట్‌లో కనపడలేదని చెప్పారు.

ఈ బంద్‌లో రాజకీయాలకు అతీతంగా తెదేపా, వైసీపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. లేకపోతె మీరు చరిత్రహినులౌతారు అని అయన అన్నారు.

Related News