//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళి మోడీ చేసిన అన్యాయానికి ఆంద్రాలో పసిపిల్లోడు కూడా క్షమించడు...

Category : politics

విభజన హామీలలో ఒకటైన ప్రేత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏపీకి మరో సారి మొండిచేయి చూపింది.రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడం లేదు. పైగా ఈ ఏడాది వెనుకబడిన ఏడు జిల్లాలకు విడుదల చేసిన రూ.350 కోట్లను మోదీ ప్రభుత్వం మార్చిలో వెనక్కి తీసుకుంది.

అయితే అధికార టీడీపీకి, బేజేపీ ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేని కారణంగా కక్ష సాదిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్యం మాత్రం అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు తెలుపని కారణంగా ఆ నిధులను వెనక్కి తీసుకున్నట్లు చెబుతుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటుంది కేంద్ర ప్రభుత్వం.

కానీ తెలంగాణలో వెనుకబడిన తొమ్మిది జిల్లాలకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రతి ఏడాది ఏపీలో వెనుకబడిన ఏడూ జిల్లాలలో, ఒక్కొక్క జిల్లా కు 50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు విడుదల చేస్తున్నారు, అదే విధంగా తెలంగాణలోని 9 జిల్లాలకు 450 కోట్ల మేర చెల్లిస్తున్నారు. అయితే ఈ సారి తెలంగాణ కి సాయం చేసిన కేంద్రప్రభుత్వం, ఏపీకి మాత్రం మొండిచేయి చూపింది.

Related News