//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గ‌త ఎన్నిక‌ల‌లో 100%రిజ‌ల్ట్ ఇచ్చిన ప్ర‌ముక మీడియా చెప్పిన ఏపీ స‌ర్వే రిపోర్టు ....

Category : politics

ప్ర‌స్తుతం ఎపీలోని నేత‌లు ఫ‌లితాలు కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఎన్న‌డు లేని విధంగా ఈ సారి ఎన్నిక‌ల‌కు ఫ‌లితాల‌కు చాలా గ్యాప్ రావ‌డంతో చాలా మంది త‌మ నియోజ‌క వ‌ర్గం లో ఏ అభ్య‌ర్థి గెలుస్తార‌ని బెట్టింగులు వేస్తున్నారు. ఇక ఈ మ‌ధ్య ఒక మీడియా చాన‌ల్ వారు నిర్వ‌హించిన స‌ర్వే హ‌ట్ టాఫిక్ గా మారింది .అయితే ఈ స‌ర్వే హాట్ టాఫిక్ కావ‌డానికి ముఖ్య‌కార‌ణం..గ‌త ఎన్నిక‌ల‌లో ఈ స‌ర్వే ఇచ్చిన రిపోర్ట్ 100శాతం క‌చ్చితం కావ‌డ‌మ‌నే చెప్పాలి . ఏపీలోని రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌త్ పై లుక్ వేస్తే ...గ‌త ఎన్నిక‌ల క‌న్న ఈ ఎన్నిక‌ల‌లో ఓటింగ్ శాతం అధికంగా క‌న‌బ‌డింది .అయితే ఇందులో ఎక్కువ‌గా మ‌హిళ‌లు ఓటింగ్ లో పాల్గోన‌డంతో రాజ‌కీయ పార్టీలు వారి ఓట్లు మావంటే మావని చెవులు దద్ధ‌రిల్లేలా అరుస్తున్నారు.

ఇక అధికార పార్టీ మాత్రం మా ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేశాం కాబ‌ట్టీ ఈ సారి మ‌ళ్లీ టీడీపీ గెలుస్తుంద‌ని చెప్పారు.ఇక వైసీపీ పార్టీ వారు మాత్రం మీరు మ‌హిళ‌ల‌కు చేసిన దాని క‌న్నా ఎక్కువ‌గా మా పార్టీ చేస్తుంద‌ని... మ‌హిళ‌లు న‌మ్మారు కాబ‌ట్టే ఈ ఎన్నిక‌ల‌లో అత్య‌ధిక శాతం ఓటింగ్ ను క‌న‌బ‌ర్చారు అని చెప్పుకుంటు వ‌స్తున్నారు.జ‌న‌సేన మాత్రం మొద‌టి నుండి యుత్ మా వైపే ఉన్నార‌ని ,ఆ యుత్ లో మ‌హిళ‌లు కూడా ఉన్నార‌ని మేము కూడా గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.అయితే వీళ్ల అంచ‌నాలు ఎలా ఉన్న ప్ర‌ముక సంస్థ ఇచ్చిన స‌ర్వే ప్రకారం ..ప్ర‌జ‌లు ప్ర‌ధానంగా వైసీపీ ,టీడీపీ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నార‌ని తేలింది .

ఇక జ‌న‌సేన కు మాత్రం 10నుండి 15 స్థానాల మ‌ధ్య‌లో గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వే తేల్చి చెప్పింది .ఇక ఈ ఎన్నిక‌ల ఓటింగ్ లో పాల్గోన్న మ‌హిళ‌లు ఓక్కో నియోజ‌క వ‌ర్గంలో ఓక్కో తీరుగా వేసార‌ని ఈ స‌ర్వే చెప్పుకొచ్చింది ..అయితే ఈ స‌ర్వే ప్ర‌కారం టీడీపీ 38నుండి 41 శాతం గెలులిచే అవ‌కాశాలు ఉండ‌గా ....ఇక పాత‌యాత్ర‌తో ఏపీని మొత్తం చూట్టోచ్చిన జ‌గ‌న్ కూడా 35నుండి 42 శాతం వ‌ర‌కు గెలిచే చాన్సు ఉంద‌ని అంటున్నాయి .అయితే ఇందులో ఓట్లు చీలే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఈ స‌ర్వే అంచానాలు వేసింది .కొన్ని నియోజ‌క వ‌ర్గాల‌లో మాత్రం అభ్య‌ర్థిని చూసి ఓటు వేయ‌గా ,కొన్ని నియోజ‌క వ‌ర్గాల‌లో మాత్రం అభివృద్ధిని చూసి ఓటు వేశారని అంటున్నారు.ఇక ఓవ‌రాల్ గా చూసుకుంటే టీడీపీ వైసీపీలు నువ్వా నేనా అన్న‌ట్టుగా ఉన్న‌య‌ని ఈ స‌ర్వే తేల్చింది.