//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశం గారికి శతసహస్స్ర శ్రద్దాంజలులు

ఒక కుఱ్ఱాడు చదువుకు ఫీజుకోసం 3/- రూపాయలు లేక తన బావగారి దగ్గర డబ్బు తీసుకుందామని 26మైళ్ళు నడచి వెళ్ళి వాళ్ళ బావగారి దగ్గర కూడ 3 రూపాయలు లేక మళ్ళీ ఇంతదూరం కాళ్ళీడ్చుకుంటూ నడిచొచ్చి పడుకుంటే కన్నతల్లి తల్లడిల్లి తన పెళ్ళిపట్టుచీరను తాకట్టు పెట్టి ఆ పిల్లవాడికిచ్చి చదివించింది. పడవలో రాజమండ్రికి ప్రయాణమై అదే పిల్లవాడు పెద్దయ్యాక ఆ నగరాధినేత అయ్యారు.

మహాత్మా గాంధీనే ఒక సమయంలో నిలదీసిన ధీశాలి. బారిష్టర్ చదివి, వృత్తిలో ఉదకమండలం (ఊటీ) నుంచి ఒడిస్సాలోని గంజాంజిల్లా వరకు ఉన్న అన్ని కోస్తా జిల్లాలోనూ అనేక ఆస్తులు సంపాదించుకుని ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్ కు రెవిన్యూ మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసి తన సర్వస్వాన్ని ప్రజలకోసం కరిగించి, ఆఖర్లో ఒకోరోజు అరటిపండు తిని సరిపెట్టుకుని, సరిగ్గా ఇవాల్టికి 60సంవత్సరాల క్రితం తినేందుకు ఏమీలేక వడదెబ్బ కొట్టి చనిపోయారు.

మొత్తం వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఉండవచ్చు, కానీ వారి మహోన్నత వ్యక్తిత్వం, త్యాగం ముందు అవి ఇసుమంత కావు. వారు జాతీయ నాయకులు. వారి వారెసులెవరో నేటికీ చాలామందికి తెలవదు. తరువాయి కాలంలో... కొన్ని సంవత్సరాలు పదవి చేస్తేనే వందల, వేలాదికోట్లు తమ వారసులకు కూడబెడుతున్నారు 'ఆధునిక' నాయకులు.

స్వాతంత్ర పోరాటంలో ఓ సమరయోధుడు పోలీసు కాల్పులలో చనిపోతే అతడ్ని చూడటానికి పోలీసు తుపాకులకు తన గుండెనెదురుపెట్టిన అసలు సిసలు ధైర్యవంతుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం గారికి శతసహస్స్ర శ్రద్దాంజలులు.