//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బుల్లితెర హాట్ యాంక‌ర్ వ‌ర్షిణి సీక్రెట్స్ అవుట్‌..?

Category : movies

తెలుగు బుల్లితెర పై సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టి.. అందాల ఆరబోత‌ను ప‌రిచ‌యం చేసిన యాంక‌ర్ల‌లో అన‌సూయ‌, ర‌ష్మీలు ముందుంటారు. ఇక వారి బాటలోనే మ‌రో యాంక‌ర్ వర్షిణి పయనిస్తోంది. ఈ అమ్మడు ఏకంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ హాట్ ఫొటోలు పెట్టి కాక రేపుతోంది. ఇక ఈమె ప్రస్తుతం తెలుగులో ఢీ 10 డ్యాన్స్ షోలో సుడిగాలి సుధీర్‌తో క‌లిసి టీమ్ లీడ‌ర్‌గా అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకుంది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే అస‌లు ఈ వ‌ర్షిణి ఎవ‌రు,. ఈమె ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చింది.. అనే విషయాలు ఆసక్తిగా మారాయి. నిజానికి వర్షిణి యాంకర్‌గా రాక ముందు కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు షామిలి సౌందరాజన్. చందమామ కథలు,బెస్ట్ యాక్టర్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో నటించింది వర్షిణి. బెస్ట్ యాక్టర్స్ సినిమా దర్శకుడు అరుణ్ పవార్‌తో షామిలి ప్రేమలో పడింది. 2015 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నామని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే విడిపోయినట్టు సమాచారం.

ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా స్టేటస్ సింగిల్ అని ఉండటాన్ని బట్టి సింగిల్‌ అని అర్ధం అవుతుంది. వర్షిణిది హైదరాబాద్.. ఆమె తల్లితండ్రులు ఎప్పుడో ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యారు. ఈ బ్యూటీ మొదట మోడలింగ్ చేసింది. అందంతో పాటు టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల వైపుకు అడుగులు వేసింది. అయితే దర్శకుడితో ప్రేమ, పెటాకులు…ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గటంతో ఢీ 10 కార్యక్రమంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ మరో వైపు యాంకర్‌గా ప్ర‌స్తుతం బిజీగా ఉంది. ఇదండి హాట్ యాంక‌ర్ వ‌ర్షిణి గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు.