Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పటాస్ కి గుడ్ బై చెప్పబోతున్న యాంకర్ శ్రీ ముఖి ....ఎందుకో తెలుసా...?

Category : movies

బుల్లితెరకి మరింత గ్లామర్ సొగసులు తీసుకొచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి కూడా చేరిపోయింది. బుల్లితెరపై ఆమె చేసే అల్లరి యూత్ కి విపరీతంగా నచ్చేసింది. నాన్ స్టాప్ గా సందడి చేస్తూ 'పటాస్' షోను ఒక రేంజ్ కి తీసుకెళ్లింది. శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు వున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టుగా చెప్పడం యూత్ ను నిరాశ పరిచింది. ఆమె ఇలా హఠాత్తుగా బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.ఇందుకు ఓ కారణం లేకపోలేదు.బుల్లితెర హాట్ యాంకర్ గా అల్లరి, అల్లరి యాంకరింగ్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ పంచే శ్రీ ముఖి.

సమయం దొరికితే ఒక్క పటాస్ స్టేజ్ పైనే కాకుండా ఏ వేదికపైన ఐన కామెడీ ఇరగ దిసే ఈ భామ.మరో పెద్ద స్టేజ్ పై దర్శనం ఇవ్వబోతోందట. అదేనండి.... ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రారంభం కాబోయే బిగ్ బాస్ -3 సీజన్ లో ఈ అమ్మడు కూడా దర్శనం ఇవ్వబోతుందట. 'బిగ్ బాస్- 3' సీజన్ లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి రావడంతో ఈ అమ్మడు కొంతకాలం పాటు పటాస్ కి బ్రేక్ ఇవ్వనుంది. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె ఈ రకమైన నిర్ణయం తీసుకుందనీ తాజా సమాచారం. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక శ్రీముఖి అల్లరి పటాస్ లోనే కాదు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూడొచ్చన్న మాట.