ప్రముఖ బుల్లితెర యాంకర్ రవి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేయడం దానికి యాంకర్ రవి సపోర్ట్ చేసినట్టుగా కామెంట్స్ చేయడంతో అసలు వివాదం మొదలైంది అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజులుగా నెటిజన్లు యాంకర్ రవిపై దుమ్మెత్తి పోస్తున్నారు మరియు యాంకర్ రవి పర్సనల్ అసిస్టెంటుకు కాల్ చేసి మరీ రవి మీద మండిపడుతున్నారు ఏపీ ప్రజలు ఇక ఈ వివాదం ముదరడంతో రంగంలోకి దిగిన యాంకర్ రవి... ఏపీ ప్రజలకు క్షమాపణలు చెబతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు
ఆ రోజు జరిగింది ముమ్మాటికి తప్పే అని రవి అన్నాడు తనకు ఏపీ ప్రజలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని రవి చెప్పుకొచ్చాడు. ఈ వివాదానికి ఇక ఇంతటితో ముగింపు పలకాలని నెటిజన్లను కోరాడు యాంకర్ రవి అయితే గతంలో కూడా ఒక ఆడియో ఫంక్షన్లో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నటుడు చలపతిరావు కామెంట్స్‌ను సపోర్ట్ చేసినట్టుగా యాంకర్ రవి చేసిన కామెంట్స్‌పై పెద్ద దుమారమే చెలరేగింది తాజాగా మరోసారి ఈ రకంగా వివాదాన్ని కొనితెచ్చుకున్న యాంకర్ రవి... సారీ అంటూ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.