Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా కి బాసటగా నిలిచిన యాంకర్ రష్మీ.... ఆమె వస్త్రధారణపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన రష్మీ.

Category : movies

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ అమ్మడు ఏం చేసినా కూడా అది వైరల్ కాక తప్పడం లేదు. రీసెంట్ గా ఈ అమ్మడు 'ఇన్ స్టైల్' అనే మేగజైన్ కోసమని.... ఫోటో షూట్లో మెరిసింది.అయితే ఈ ఫొటో షూట్ లో ఈ అమ్మడు కట్టిన చీరకట్టు పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా ప్రియాంక చోప్రా ఈ ఫోటో షూట్ లో ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి నీ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రియాంక చోప్రా చీర కట్టు వివాదాస్పదంగా మారింది.ఇక్కడ ఆమె చిరకట్టడం తప్పు కాదు కాకపోతే మన 'భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీకట్టును అవహేళన చేయడమే అసలు తప్పు అంటూ కొందరు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు... ఇంకొందరు అయితే ఈ విషయం పై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని పరోక్షంగా వాదిస్తున్నారు.అయితే ఇదే వ్యవహారం పై ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలవరించింది.

పూర్వం భారతదేశంలో కొన్ని భిన్నమైన ఆచారాలు పాటించే ఆడవాళ్లు రవికె లేకుండానే చీర ధరించేవారు. కాలక్రమంలో ఆ నాగరికత పెరిగి ఈ రవికె ధరించడం వాడుకలోకి ఒచ్చిందంటూ సదరు మీడియా ఛానెల్ రాసిన కథనంలో చెప్పుకొచ్చింది.అంతేకాదు వాళ్ల కథనంలో ప్రియాంక బ్లౌజ్ లెస్ షూట్ ను సపోర్ట్ చేస్తూ.. ఈ విషయంపై రాద్ధాంతం చేయవలసిన పని లేదంటూ కాస్త గట్టిగానే చెప్పింది. అయితే తాజాగా ఇదే విషయమై యాంకర్ రష్మీ ఓ కధనాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ప్రియాంక చోప్రా కు సపోర్ట్ గా నిలిచింది. అంతే కాకుండా ఎవరి వస్త్రధారణ వారిష్టం. మహిళల వస్త్ర ధారణపై ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరంలేదనే సందేశాన్ని రష్మీ వినిపించింది.ముందు నుంచి కూడా యాంకర్ రష్మి స్త్రీవాది అనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఈ అమ్మడు పలు సందర్బాలలో మహిళలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, వారు ఎదుర్కొంటున్న సమస్యల పై ఆమె తన దైన రీతిలో ఎప్పటికప్పుడు రష్మి స్పందిచడం విశేషం. ఈ నేపధ్యంలోనే ఆమె మరో నటి పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడం గొప్ప విషయం.

Related News