Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాడేసుకున్నారా.. యాంక‌ర్ ర‌ష్మీ వైర‌ల్ మ్యాట‌ర్‌..!

Category : movies

తెలుగు బుల్లితెర హాట్ ప్రోగ్రాం జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాంక‌ర్ రష్మీ గౌత‌మ్‌. ఒక‌వైపు బుల్లితెర.. మ‌రోవైపు వెండితెర పై కూడా మెరుస్తోంది ర‌ష్మీ. ఇక వాటితో పాటు కొన్ని ఈవెంట్స్ చేస్తోంది. ఇక ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో తిరుగుతూ కల్చరల్ ఈవెంట్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటోంది. సాధారణ యాంకర్ల కన్నా డబ్బులను చాలా ఎక్కువగానే తీసుకుంటోందట రష్‌మీ. అయితే అసలు మ్యాట‌ర్ ఏంటంటే ఈ మధ్య రష్‌మీకి బాగా కోపమొచ్చిందని టాక్‌.

అసలు రష్మీకి కోపమెందుకు వచ్చిందంటే, అమెరికాలోని తెలుగు సంస్థ నాటా తనను సంప్రదించకుండానే తన పేరును ఒక ఈవెంట్‌లో వేసేసిందట. పేరు కాదు ఫోటోలు కూడా వేసి రష్మీతో పాటు ప్రభాస్, శ్రీనువైట్ల వస్తున్నట్లు ప్రచారం కూడా బాగానే చేసి.. టిక్కెట్లు బాగానే అమ్ముకున్నార‌ట‌. ఈ విష‌యం ర‌ష్మీకి తెల‌య‌డంతో.. వెంటనే నాటా నిర్వాహకులకు ఫోన్ చేసి చెడామడా తిట్టేసిందట. మీరెందుకు ఇలా చేస్తున్నారు.. నాటా నుంచి ఇంతవరకు ఎవరూ నాకు ఫోన్ చేయలేదని.. నా ఫోటో ఎలా మీరు వేసుకుంటాని ప్రశ్నించదట. మరోసారి ఇలా జరిగితే బాగుండదని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయితే రష్మీ కోప్పడినా నిర్వాహకులు మాత్రం దాన్ని లైట్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం.