//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రదీప్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా ? గెటుప్ శ్రీను చెప్పిన నిజాలు !

Category : editorial

తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో యాంకర్ ప్రదీప్ ఎంత ఫేమస్ యాంకర్ ఓ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రదీప్ కేవలం యాంకర్ గానే కాక నటుడుగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే నటుడిగా కంటే కూడా ప్రదీప్ యాంకర్ గానే భారీగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు.

ప్రదీప్ ఈరోజు ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ అయ్యుండచ్చు కాని ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ గా నిలదొక్కుకోడానికి ప్రదీప్ చాల కష్టపడ్డాడు. ప్రదీప్ అంత సులభంగా ఏమి యాంకర్ కాలేదు. ముందుగా కొన్ని లోకల్ చానల్స్ కి ప్రదీప్ యాంకర్ గా పని చేశాడు. లోకల్ చానెల్స్ కే కాక కొన్ని ఈవెంట్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరించేవాడు.

ఇటీవల జబర్దస్త్ ఫేం గెటప్ శ్రీను ఒక యూట్యూబ్ చానెల్ కి ఇంటర్వ్యు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిలో ప్రదీప్ కి సంబంధించిన కొన్ని విషయాలని కూడా వీక్షకులతో పంచుకున్నాడు శ్రీను. శ్రీను చెప్పిన విషయాలు ఆయన వెర్షన్ లోనే "ప్రదీప్, నేను మరియు సుధీర్ ఒక లోకల్ ఛానెల్ లో పని చేశాం. ప్రదీప్ అప్పుడు నా కొలీగ్. అతను ఎంత కష్టపడి పని చేసాడో నేను సుదీర్ దగ్గరనుండి చూసాం.

ప్రదీప్ చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే డానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రదీప్ తన TV షో ల కోసం ఖరీదైన మరియు బ్రాండ్ దుస్తులు ధరిస్తాడు. అయితే షో అయిపోయిన వెంటనే అందరిలా ప్యాక్ చేయించి ఇంటికి పట్టుకెళ్ళకుండా ఆ బట్టలని వేలం వేసి అమ్మేస్తాడు. వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బుని అతను అనాధ శరణాలయాలు మరియు సామాజిక సేవా సంస్థలకి విరాళంగా ఇచ్చేస్తాడు.

ఇప్పుడు టీవీ షో లు అలాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఇలా ఎలా అయినా డబ్బు సంపాదించనివ్వండి సంపాదించిన వాటి నుండి పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా అందజేస్తాడు. ఒక్క డిసెంబర్ 31 రాత్రి మందు తాగి డ్రైవ్ చేసినందుకు రకరకాల వార్తలు వ్రాసి ఇబ్బంది పెట్టిన మీడియా ఇలాంటి మంచిని మాత్రం ఎందుకు చూపించదు అని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.

Related News