//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా అలరించనున్న యాంకర్ లాస్య ?

Category : movies

బిగ్‌బాస్ సీజన్ 3 త్వరలో వచ్చేస్తోంది.ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ కూడా ఆడియెన్స్‌‌కి బాగానే కనెక్ట్ అయ్యాయి.ఈ షో యొక్క సీజన్ 3 మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ముస్తాబై రానుంది.దీనికి సంబంధించిన పలు ప్రోమోలు ఇప్పటికే షోపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి.ఈ సీజన్‌‌కి హోస్ట్‌ గా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చేయనున్నారు.అయితే అంతా ఓకే కానీ,మరి ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది.

తాజాగా ఇందులో యాంకర్స్,రాజకీయ నాయకులు,నటులు, మరియు అలాగే క్రీడా ప్రముఖులు ఉంటారని తెలుస్తోంది.అయితే తాజాగా ఇప్పుడు ఒక న్యూస్ బయటికొచ్చింది.బి‌గ్‌బాస్ 3 వ సీజన్‌లో యాంకర్ లాస్య సందడి చేయనుందని తెలుస్తోంది. యాంకర్ రవితో స్మాల్‌స్క్రీన్ షేర్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ల లిస్ట్‌లో చేరిన ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత పెళ్లి చేసుకుని యాంకరింగ్‌కి దూరమైపోయింది.

ఈ మధ్యకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న లాస్యని బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా చేయమని మాటీవీ యాజమాన్యం కోరిందని..అలాగే దీనికి లాస్య కూడా అంగీకరించిందని వార్తలొస్తున్నాయి.ఈ షో మరోసారి తనకి మంచి ఫేమ్‌ని తీసుకొస్తుందని లాస్య వెయిట్ చేస్తుందట.సో మరి ఇది నిజమా.కాదా అనే విషయం మనకు త్వరలోనే తెలుస్తోంది.