//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైపర్ ఆది నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు.. యాంక‌ర్ అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్‌..!

Category : movies

తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్ధ‌స్త్ ప్రోగ్రాంకి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా టీఆర్పీ రేటింగ్స్‌లో మాత్రం దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో హైప‌ర్ ఆది స్కిట్‌లు ఈ మ‌ధ్య త‌ర‌చూ వివాదాల‌కు గురి అవుతున్నాయి. కొన్ని నెల‌ల క్రిత్రం పోలీస్ స్టేష‌న్‌లో హైప‌ర్ ఆది పై కేసులు కూడా న‌మోదైన విష‌యం తెలిసిందే. అయినా తీరు మార్చుకోని హైప‌ర్ ఆది మ‌రోసారి కొత్త వివాదానికి తెర‌లేపాడు.

ఇక అసలు విష‌యంలోకి వెళితే తాజాగా జ‌రిగిని జ‌బ‌ర్ధ‌స్త్ షోలో హైప‌ర్ ఆది.. యాంక‌ర్ అన‌సూయ‌ను రెచ్చ‌గొట్టి మ‌రీ హగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజా స్కిట్‌లో భాగంగా.. స్వర్గం కనిపించాలంటే ఏంచేయాలిరా అని హైపర్ ఆది తన టీమ్ మెంబర్స్ ను అడగ్గా… వాళ్లు సరిగ్గా రిప్లయ్ ఇవ్వరు. మళ్లీ తనే అందుకుని అనసూయను హగ్ చేసుకుంటే చాలు. స్వర్గం అదే కనిపిస్తుంది అంటూ పంచ్ వేస్తాడు. ఆపై ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అనసూయను టీజ్ చేస్తాడు. అయినా అన‌సూయ లైట్ తీసుకోవ‌డంతో.. ఢీ షోలో ఏదైనా డిఫరెంట్‌గా చేస్తే ప్రియమణి వచ్చి హగ్ ఇస్తుందని, ఇక్కడెవరూ ఇవ్వడంలేదని.. హైప‌ర్ ఆది రెచ్చ‌గొట్ట‌గా.. అన‌సూయ కొంచెం ఇబ్బంది ప‌డుతూ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో వ‌చ్చి ఆదికి హ‌గ్ ఇస్తుంది.

హైపర్ ఆది మాత్రం చాన్స్ దొరికింద‌ని.. అనసూయను కాసేపు అలానే కౌగిలించుకోవ‌డ‌మే కాకుండా అలాగే చాలా సేపు అన‌సూయ‌ని వ‌ద‌ల‌కపోవ‌డంతో అన‌సూయ‌కి మండిపోయింద‌ట‌. దీంతో ఇంటికి వెళ్ళగానే ఆదికి ఫోన్ చేసి చెడ మాడా తిట్టేసిందట. స్టేజి మీద ఉన్నప్పుడు నటించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదని ఏదేమైనా నీ బిహేవియర్ ఓవ‌ర్ అవుతోంద‌ని.. నీ లిమిట్స్ దాటొద్ద‌ని ఆది పై ఫోన్‌లోనే అసహనం వ్యక్తం చేసిందట అనసూయ. ఇదే విషయంలో అనసూయ భర్త కూడా కొంచెం గరం అయినట్టు సమాచారం. ఇక హైపర్ ఆది ఎంత మొత్తుకున్నా అనసూయ మెత్తబడకపోవడంతో ఈ విషయం మల్లెమాల ఎంటర్టయిన్ మెంట్స్ అధినేత ద‌గ్గ‌ర‌కు వెళ్లిందట. దీంతో ఆయన ద్వారానే అనసూయకు నచ్చచెప్పే ప్రయత్నం చేయాలని.. అవ‌స‌ర‌మైతే అంద‌రి ముంది ఆదితో అన‌సూయ‌కు సారీ చెప్పించాల‌ని జబర్దస్త్ టీమ్ భావిస్తోందని స‌మాచారం.