Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జబర్దస్త్ క్రేజ్ లో యాంకర్ అనసూయ....అందుకే జబర్దస్త్ కి బ్రేక్ ....?

Category : movies

బుల్లితెర పై యాంకర్ గా వెండి తెరపై నటిగా ఎప్పటికప్పుడు తనదైన అందం అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్.పేరు కు తగ్గ హావ భావంతో ఔరా అనిపించే అందం ఈ అమ్మడి సొంతం . సరిగ్గా కొన్నేళ్ల కిందట వెండితెర నటిగా దర్శనం ఇచ్చి అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక బుల్లితెర పై తనదైన గ్లామర్ చేమక్ లతో ఓల్లే వేస్తూ జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇన్నాళ్లు జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనుందా.... ? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. అసలు వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ కామెడీ షోలో తనదైన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ,మెప్పిస్తున్న ఈ అమ్మడు.తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటూ.... మెప్పించడం విశేషం.

ముఖ్యంగా ‘క్షణం,రంగస్థలం’ సినిమాల్లో నటిగా అనసూయకు మంచి పేరునే తీసుకొచ్చాయి. అదే ఊపులో ఇపుడు అనసూయ మెన్ రోల్ లో ‘కథనం’ సినిమ ా కూడా తెరకెక్కింది.ఇలా వరుస పెట్టీ అవకాశాలు ఆమె కు వస్తు ఉండడం తో అటు సినిమాలు ఓటు టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేయడంలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తెగ ఇబ్బంది పడుతుంది.అందుకే అనసూయ పూర్తిగా సినిమా ల పైనే ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే అందిన కాడికి అవకాశాలు రాబట్టు కునేందుకు సిద్దం అయ్యింది అనసూయ.అందుకే ఇప్పుడు చేస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాంకు కాస్తంత విరామిచ్చి పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మొత్తానికి జబర్ధస్త్ పోగ్రాంతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న అనసూయ.. ఇపుడు వరుసగా సినిమా అవకాశాలతో జబర్దస్త్‌కు విరామం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.చూడాలి మరి ఈ అమ్మడు ఫేట్ సినిమాల్లో ఏవిధంగా రాసిపెట్టి ఉందనేది.