//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు సమక్షం లో అనంతపురం పంచాయతీ.....!

Category : politics

అనంతపురం పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకి చేరింది. సీఎం చంద్రబాబు వద్దకి ఈ రోజు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరివచారు. సీఎం తో కాసేపు మాట్లాడారు. ఈ వ్యవహారం పై అనంత ఫైర్ బ్యాండ్ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతపురంలో రోడ్డు విస్తరణ సందర్భంగా ప్రార్థనా మందిరాలను తొలగించాలని జేసీ పట్టుబడుతున్నారు. ప్రార్థనా మందిరాలను తొలగించవద్దని ఆయా సామాజికవర్గాలు కోరుతున్నాయి. ప్రార్థనామందిరాల కమిటీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. ప్రభాకర్‌చౌదరే వాళ్లను కోర్టుకు పంపించారని దివాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

దీనితో ఈ వ్యవహారం సీఎం బాబు దగ్గరికి వెళ్ళింది. దీనితో టీడీపీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కీలక సమయంలో జేసీ పాల్మెన్ట్ లోకి వెళ్ళలేదు. పార్టీలో కొందరు నేతల వైఖరికి నిరసనగా తాను అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో కూడా పాల్గొనబోనని తెలిపారు. బుధవారం పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు కూడా ఆయన పార్లమెంటుకు హాజరుకాలేదు.

Related News