//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ శ్రేణుల‌కు బిగ్ షాక్.. నేను పార్టీ మార‌డంలేదు.. ఆనం బ్ర‌ద‌ర్ సంచ‌ల‌నం..!

Category : politics

ఏపీ రాజ‌కీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. సింహ‌పురీ జిల్లాలో ఆనం బ్రదర్స్‌గా ముద్ర వేసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు మూడు దశాబ్దాలుగా ఎన్నో పదవుల్లో కొనసాగారు. 2016 జనవరి 17న కాంగ్రెస్‌ను వీడి సీఎం చంద్రబాబు సమక్షంలో వీరు సైకిలెక్కారు. అయితే ఇటీవ‌ల నెల్లూరు సోగ్గాడు ఆనం వివేక నంద‌రెడ్డి తీవ్ర‌మైన ఆరోగ్య‌స‌మ‌స్య‌తో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడం ఖాయమని సోష‌ల్‌మీడియాలో వార్త‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆనం బ్రదర్‌గా రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి గ‌తంలో ఆత్మకూరు ఇన్‌చార్జిగా రామనారాయణరెడ్డి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టీడీపీ అధిష్టానం నుండి ఎమ్మెల్సీ ప‌ద‌వి హామీ వ‌చ్చినా అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

ఇక‌ ఆ త‌ర్వాత కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆనం సోదరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. ఇక చాలా రోజులు సైలెంట్ అయిపోయారు ఆనం బ్ర‌ద‌ర్స్‌. ఇక ఇటీవ‌ల ఆనం వివేక నందరెడ్డి అనారోగ్యంతో మ‌ర‌ణించిడంతో ఆనం ఫ్యామిలీకి పెద్ద షాకే త‌గిలింది. ఈ నేపధ్యంలో ఆనం రాంనారాయ‌ణ రెడ్డి టీడీపీని వీడ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ శ్రేణులు.. అనుకూల సోష‌ల్ మీడియా వారు త్వర‌లోనే ఆనం బ్ర‌ద‌ర్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం మొద‌లెట్టారు.

దీంతో ఈ వార్త‌లు ఆనం రాంనార‌య‌ణ‌కు వ‌ద్ద‌కు కూడా చేర‌డంతో.. తాను ఎట్టి ప‌రిస్థితుల్లో టీడీపీని వీడ‌డం లేద‌ని.. అంతే కాకుండా వైసీపీలో చేరే అవ‌కాశ‌మే లేద‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద అన్న‌ట్టు స‌మాచారం. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు.. మంత్రి నారా లోకేష్‌కి కూడా ఫోన్‌లో చెప్పార‌ని స‌మాచారం. ఇక త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి విష‌యానికి వ‌స్తే కొన్ని ప్ర‌తికూల పరిస్థితుల వ‌ల్ల త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రాలేద‌ని అంత మాత్రానా పార్టీ మారే వ్యక్తిని కాద‌ని ఆనం త‌న స‌న్నిహితులతో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో తేల్చేశార‌ని తెలుస్తోంది. దీంతో ఈ విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కి రావ‌డంతో వైసీపీ శ్రేణుల‌కు పెద్ద షాకే త‌గిలింద‌ర‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Related News