//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రావణమాసంలో వైసీపీ ఎంట్రీకి సిద్దమైన ఆనం......!

Category : politics

నెల్లూరు జిల్లాలో వైసీపీ రోజు రోజుకి మరింతగా బలపడుతుంది. ఇప్పటికే బలంగా ఉన్న వైసీపీ, ఆనం లాంటి కీలకనేతల చేరికతో ఇంకా పటిష్ఠతమయ్యే అవకాశం ఉంది అని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారు.

టీడీపీ లో వున్న వైసీపీలో చేరాలనుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆషాఢ మాసం అడ్డు వచ్చింది. ఆయన గురువారం హైదరాబాద్‌లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో ఆయన చేరికకు జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయమై ఉభయుల మధ్య చర్చ జరిగింది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆనం చెప్పారు అని తెలుస్తుంది. సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఉన్నాడు కదా అని చెప్పినట్టు సమాచారం. వెంకటగిరి నుంచి ఆనంను బరిలోకి దింపే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం.