//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక అంకుల్ నన్ను అసభ్యంగా తాకాడు

Category : movies national

మహిళలపై అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వీటిపై ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా మార్పు రావడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా మ్రుగాళ్లు రెచ్చిపోతున్నారు. అత్యాచారాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ హీనంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా దీనిపై ఒక నటి తన జీవితంలో ఎదురైన అనుభవం గురించి వివరించింది. స్టార్‌ప్లస్’ షో ‘ఇష్క్‌బాజ్’ నటి శ్రేణుపరేఖ్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు.

తన ఆరేళ్ల వయసులో తనకు బ్యాడ్‌టచ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైందని వెల్లడించారు. అప్పట్లో వేసవి సెలవుల్లో మేము బంధువుల ఇంటికి బస్సులో వెళ్లేవాళ్లం. ఒకసారి బస్సులో వెళుతున్నప్పడు ఒక అంకుల్ నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని అభ్యంతరకరంగా తాకాడు. అప్పట్లో నాకదేమీ తెలియలేదు. నా స్నేహితులకు కూడా ఇటు వంటి అనుభవం ఎదురైందని చెప్పేవారు. ఈ విషయాలు పెద్దవాళ్లకు చెబితే మమ్మల్ని నమ్మరేమోనని మౌనం వహించేవాళ్లం. వీటిని చెప్పేందుకు భయపడేవాళ్లం’ అని శ్రేణు తెలిపారు.