//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రేమ, పెళ్లిపై అమృత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Category : state

ఒక ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. మిర్యాల‌గూడ ప్ర‌ణ‌య్ హ‌త్య పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ప్రేమ పెళ్లిళ్లా..? పెద్ద‌ల మ‌న‌స్సులా..? అన్న చ‌ర్చ మొద‌లైంది. త‌న కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ‌న్న అక్క‌సుతో ప్ర‌ణ‌య్‌పై క‌క్ష పెంచుకున్న అమృత తండ్రి మారుతీరావు ప్ర‌ణ‌య్‌ను దారుణంగా హ‌త్య చేయించాడు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కిరాయి హంత‌కుల‌తో హ‌త్య చేయించిన తీరు అంద‌ర్నీ క‌లిచివేసింది.

అంతేకాకుండా, మారుతీరావును జ‌నం తిట్టిపోశారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. మారుతీరావును త‌ప‌పుబ‌ట్టిన వాళ్లు కొంద‌రైతే ప్ర‌ణ‌య్, అమృత‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన వారు లేక‌పోలేదు. బ‌య‌సొచ్చింది క‌దా..? అని త‌ల్లిదండ్రుల గుండెల‌పై త‌న్నిపోతే ఎలా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు నెటిజ‌న్లు. త‌ల్లిదండ్రుల ఆలోచ‌న‌ల‌కు విలువ ఇవ్వ‌ర‌ని త‌ప్పుబ‌ట్టిన వారు ఇంకొంద‌రు. ఇలా త‌మ ఆలోచ‌న‌ల‌ను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న విష‌యం తెలిసిందే.

ఆ క్ర‌మంలోనే, ఓ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ప్ర‌ణ‌య్, అమృత ప్రేమ పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తొమ్మిదేళ్ల‌కే ప్రేమ, మొండిత‌నం ఉంటే.. త‌మ బిడ్డ‌కు బంగారు భ‌విత ఇవ్వాల‌నుకున్న త‌ల్లిదండ్రుల‌కు ఇంకెంత మెండిత‌నం ఉండాలి..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌తీ త‌ల్లిదండ్రులు వారి వారి బిడ్డ‌ల‌కు బంగారు భ‌విత ఇవ్వాల‌న్న ఉద్దేశంతో.. ఉన్న‌త చ‌దువులు చ‌దివించాల‌న్న ఉద్దేశంతో బ‌డుల‌కు పంపిస్తారు. తాము ప‌స్తులున్న‌ప్ప‌టికీ.. బిడ్డ‌కు మాత్రం మూడు పూట‌లా అన్నం పెట్టాల‌ని అనుకుంటారు. అటువంటి త‌ల్లిదండ్రుల గుండెల మీద కొట్ట‌డానికి పిల్ల‌ల‌కు ఏం అర్హ‌త ఉంద‌ని ప్ర‌శ్నించింది. బ‌డిలో, కాలేజీలో ఎవ‌రో ఒక‌రు అందంగా క‌నిపించార‌ని, వారికి ఐ ల‌వ్యూ చెప్పి.. పెళ్లి చేసుకుంటే స‌రిపోతుందా..? మ‌రి మీ త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి గురించి ఆలోచించ‌వా..? అంటూ ప్ర‌శ్నించింది. నిన్ను చ‌దువుకోమ‌ని బ‌డికి పంపిస్తే..ప్రేమ, పెళ్లి అంటూ వెధ‌వ వేషాలేస్తే ఏ త‌ల్లిదండ్రులు మాత్రం స‌హిస్తారండీ అంటూ

మీడియా సాక్షిగా ప్ర‌శ్నించింది.

ఇదిలా ఉండ‌గా, ఆ యువ‌తి సంధించిన ప్ర‌శ్న‌ల‌పై ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమృత స‌మాధానం ఇచ్చింది. అవును, తొమ్మిదో త‌ర‌గ‌తిలో మా మ‌ధ్య ఉన్న‌ది అట్రాక్ష‌న్ కావొచ్చు.. ల‌వ్ కావొచ్చు. కానీ, మేము అప్పుడే పెళ్లి చేసుకోలేదు క‌దా..! నాకు 18 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన త‌రువాత మా త‌ల్లిదండ్రుల‌కు చెప్పా. ప్ర‌ణ‌య్ కూడా మా త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ, వారు ఒప్పుకోలేదు. దీంతో మా ఇద్ద‌రికి మెచ్చూర్డ్ వ‌య‌స్సు వ‌చ్చిన త‌రువాత పెళ్లి చేసుకున్నామంటూ చెప్పింది అమృత‌.

మ‌న దేశంలో కేవ‌లం 18 సంవ‌త్స‌రాల‌కే దేశాన్ని పాలించే నాయ‌కుల‌ను ఎన్నుకునే ఓటు వేసే హ‌క్కు వ‌స్తుంది. అటువంటిది పెళ్లి నిర్ణ‌యం తీసుకునేందుకు స‌రైన ఆలోచ‌న ర‌దా..? అంటూ ఆ యువ‌తిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది అమృత‌.

Related News