//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమిత్ షాని మార్చే అవకాశం ఉందా..?

Category : politics

ఇప్పుడు బిజెపి వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఇది. అమిత్ షాని మార్చే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం. ఎవరు అవునన్నా కాదన్నా మోడిపై ఉన్న ప్రజాదరణ అమాంతం తగ్గిపోయింది. 2014లో ఆయనను కీర్తించిన వారే వేనోళ్ళ తిడుతున్నారు. ఇలాంటి ప్రధానిని మేము ఎక్కడా చూడలేదు అనే భావన వారిలో వచ్చేసింది. మాటలు మినహా ఆయన చేసింది ఏమి లేదు అనే అభిప్రాయంలోకి ప్రజలు వచ్చేశారు.

దీనితో ఆయనకు పార్టీలో పట్టు కూడా క్రమంగా తగ్గుతూ రావడమే కాక బిజెపిపై ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా ఆయన కారణంగా తగ్గిపోతుంది. దీనితో పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు అనేది విశ్లేషకుల మాట. ముందుగా మోడీ చెప్పినట్టు తల ఊపే అమిత్ షాని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలి అనేది ప్రధానంగా వినపడుతున్న మాట. ఎవరు ఎన్ని చెప్పినా అమిత్ షా అనే వ్యక్తిపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మోడీ ఉన్నప్పుడే పార్టీ కార్యాలయానికి రావడం...

మోడీ మాటకే విలువ ఇవ్వడం వంటివి అమిత్ షా చేస్తూ ఉంటారు. ఒకవేళ బిజెపి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ కి ముఖ్యమంత్రిగా అయినా వెళ్ళవచ్చు... లేదా కేంద్ర మంత్రి అయినా అయిపోవచ్చు. ముందుది జరిగితే ఇబ్బంది లేదు గాని ఆయన కేంద్ర మంత్రిగా ఉంటె మాత్రం ఇతరులకు కాస్త చికాకుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పదవిగాని, ఆయన గాని ఎవరికి ఇష్టం లేదు. దీనితో ఆయన కేంద్రం నుంచి పంపించాలనే అభిప్రాయం బలంగా వినపడుతుంది. ఆయనను పంపిస్తే మోడీ ఒంటరి అయిపోతారని క్రమంగా ఆయనను కూడా తప్పించవచ్చని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

Related News