//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దిగొచ్చిన కేంద్రం : బాబుకి అమిత్ ఫోన్

Category : politics

ముఖ్యమంత్రి చంద్రబాబు దెబ్బకి భాజాపా అధ్యక్షుడు అమిత్ షా దిగి వచ్చినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్‌ చేసి మాట్లాడారని సమాచారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనున్న నేపధ్యంలో పార్లమెంటరీ సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారని తెలుస్తోంది. త్వరలోనే అన్ని విషయాలపై చర్చిద్దామని అమిత్‌షా అన్నట్టు తెలుస్తోంది.

ఏపీకి అన్నివిధాల కేంద్రం నిధులు మంజూరు చేస్తూ ఆదుకుంటుందని ఏపీ బీజేపీ నేతలు ప్రచారం చేస్తూ, టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడమా? లేక మిత్ర పక్షంగా కొనసాగుతూ పోరాటం చేయాలన్నదానిపై ఆదివారం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీపీ సమాశం మొదలయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడతో అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు.

Related News