//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నవ్వుల పాలయిన బీజేపి

Category : national

కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించిన బీజేజీ జాతీయ విభాగం ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ తానే ఇబ్బందుల్లో పడ్డారు.

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను స్త్రీలోలుడిగా చూపే ప్రయత్నంలో తప్పు చేసి నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన సోదరి విజయలక్ష్మీ పండిట్‌తో నెహ్రూ ఆత్మీయంగా ఉన్న9 ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మాలవీయ ‘‘హార్ధిక్‌కు నెహ్రూ డీఎన్ఏ ఎక్కువైనట్టు కనిపిస్తోంది’’ అని కామెంట్ రాశారు.

అయితే ఆయన పోస్ట్ చేసిన 9 ఫొటోల్లో రెండు నెహ్రూను హత్తుకున్నది ఆయన సోదిరి విజయలక్ష్మి కాగా, మిగతావి కూడా అంత అభ్యంతరకరంగా లేవు. ఈ ఫొటోలపై స్పందించిన నెటిజన్లు అమిత్ మాలవీయపై నిప్పులు చెరుగుతున్నారు.

ఆయన అజ్ఞానాన్ని, నీచబుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఇటువంటి పోస్టులు పెట్టేముందు ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దని అమిత్‌కు కొందరు సలహా కూడా ఇస్తున్నారు.