//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమితాబ్‌కు అస్వస్థత...!

Category : movies

ఆలిండియా సూపర్ స్టార్ గా పిలవబడే అమితాబ్ బచ్చన్ గురించి అందరి తెలుసు. ఏడూ పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం అయన మూడు సినిమాలలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం అయన విజయ్‌కృష్ణ ఆచార్య థగ్స్ ఆఫ్ హిండోస్థాన్ చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్ జోథ్‌పూర్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో అయన కొంత అస్వస్థతకు లోనయ్యారు, వెంటనే యూనిట్ సభ్యులు అక్కడే వున్న హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అక్కడ వున్న డాక్టర్స్ అయన కు వైద్యం అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే వుంది అని చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న అయన సొంత వైద్య బృదం హుటాహుటిన జోథ్‌పూర్‌ కు చేరుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమాచారం తెలియజేస్తానని అమితాబ్ తన అభిమానులను ఉద్దేశించి ట్వీటర్ లో పేర్కొన్నారు. అయన తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారని సినీ వర్గాల సమాచారం.