//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీహార్ లోని 2100 మంది రైతులను ఆర్థికంగా ఆదుకున్న అమితాబ్ బచ్చన్....ఇది కదా అసలైన హీరోయిజం అంటే...!

Category : movies

కేవలం హీరోయిజం అంటే సినిమా తెరపై చూపించడమే కాదు. తెర వెనుక కూడా చూపించేదే అసలైన హీరోయిజం అని నిరూపించాడు... బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ . ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాల ఆదుకున్న బిగ్‌బీ తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకొని వార్తల్లో నిలిచాడు. ఈ మధ్య చిన్న చితక సాయం చేస్తేనే తామేదో ప్రపంచాన్ని ఉద్దరించినట్టు ఊహించుకునే తారల మధ్య అసలైన ధ్రువ తారల నిలిచాడు బిగ్ బి. తాజాగా ఆయన .... బిహార్‌లోని 2,100 మంది రైతులను రుణ విముక్తులను చేసాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన బ్లాగ్‌లో వెల్లడించారు. నేనిచ్చిన మాట ప్రకారం.. బిహార్‌లో అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతుల్లో రెండు వేల మందిని ఎంపిక చేసి వారందరి అప్పులు తీర్చినట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్ ..... కొందరికి తానే నేరుగా బ్యాంకుల్లో వేస్తే.. మరికొందరికి స్వయంగా తన ఇంటికి పిలిచించి మరి చెక్కులను తన కూతురు శ్వేత, కొడుకు అభిషేక్ బచ్చన్‌ల ద్వారా అందజేసారు.

అంతేకాదు పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాన్ని త్వరలోనే ఆదుకోనున్నట్టు ఆయన చెప్పారు.అంతకు ముందు అమితాబ్ వచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-10 కు సంబంధించి ముంబైలో జరిగిన ఈవెంట్‌లో అమర జవాన్లకు సంబంధించి 44 కుటుంబాలకు కోటీ రూపాయాల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి దేశానికి వెన్నుముక అయిన రైతులు, సిపాయిలకు తమ వంతు సాయం చేస్తూ అమితాబ్ నిజంగానే రియల్ హీరో అని నిరూపించుకున్నారు. పది మందికి నచ్చేలా సినిమా తీస్తే ఎవరైనా స్టార్స్ అవుతారు.అదే పది మంది మెచ్చేలా ఏ పనిని అయిన చేస్తేనే రియల్ హీరోస్ అవుతారు.అలాంటి అరుదైన జాబితాలో అసామాన్య సేవ చేస్తున్న అమితాబ్ బచ్చన్ నిజంగానే రియల్ స్టార్.ఆయన భవిష్యత్తులో ను ఇలాంటి మంచి మంచి పనులు ఇంకెన్నో చేయాలని కోరుకుందాం.