//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమిత్ షా అమాయకపు వ్యాఖ్యలు

Category : national politics

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అమాయకపు వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐఖ్యత గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయన అమాయకత్వాన్ని సూచిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణస్వీకార వేదకపై విపక్ష నేతలంతా ఐక్యతను చాటుకోవడంపై మాట్లాడుతూ, ఒకే వేదికపై చేతులు కలిపినంత మాత్రాన వారంతా ఓటర్లను ప్రభావితం చేయలేరని అన్నారు.

'మమతా బెనర్జీ ప్రభావం పశ్చిమబెంగాల్‌కే పరిమితం. శరద్ పవార్ ప్రభావం మహారాష్ట్రలోనే. కుమారస్వామి కర్ణాటక దాటితే ఏమీ చేయలేరు. 2019లో విపక్షాల ఐక్యత ప్రభావం ఏమాత్రం ఉండదు' అని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వ వ్యతిరేకతపై అడిగినప్పుడు...ప్రభుత్వ వ్యతిరేకత అనేది అన్ని చోట్లా వర్తించదని ఆయన సమాధానమిచ్చారు. ఇలా దేశ వ్యాప్తంగా విపక్షాలు అన్ని కలిసి పోటి చేస్తే రాష్ట్రాల్లో మీరు ఎలా విజయం సాధిస్తారు అంటూ సోషల్ మీడియాలో అమిత్ షాని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు