//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప‌వ‌న్ - షాల భేటీ.. డేట్ ఫిక్స్‌..!

Category : politics

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన చంద్ర‌బాబుతో బీజేపీ విభేదించిన విష‌యం తెలిసిందే. ఎలాగైన ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించాల‌నే ల‌క్ష్యంతో, అలాగే, ఏపీ ప్ర‌జ‌ల అభివృద్ధే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. మొత్తానికి భార‌తీయ జ‌నతా పార్టీకి, ఎన్డీయే కూట‌మికి చంద్ర‌బాబు భారీ న‌ష్టాన్నేచేకూర్చుతున్నారు. దేశ వ్యాప్తంగా న‌రేంద్ర మోడీ ప‌త‌నానికి చంద్ర‌బాబు నాంది ప‌లుకుతున్నారు.

ఎంతలా అంటే ఈ మ‌ధ్య‌నే వెలువ‌డుతున్న స‌ర్వేల‌న్నీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తికూలంగానే ఫ‌లితాల‌ను వెలువ‌రిస్తున్నాయి. మొత్తానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ నామ మాత్ర‌పు సీట్ల‌నే గెలుచుకుంటుంద‌ని స‌ర్వేల‌న్నీ కుండ బ‌ద్ద‌లుకొడుతున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై బీజేపీ ఆశ‌లు వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి. మ‌రి దీనికి కార‌ణ‌మ‌వుతున్న చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు. దేశ వ్యాప్తంగా కోల్పోతున్న ప్రాభ‌వాన్ని తిరిగి నిల‌బెట్టుకోవ‌డానికి బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో సంప‌ర్క్ సంవ‌ర్ధ‌న్ కార్య‌క్ర‌మం కూడా ఒక‌టి.

అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా దేశంలోని ప్ర‌ముఖ వ్యాపార‌స్తుల‌ను, అలాగే, ఎన్డీయే మిత్రుల‌ను క‌లిసి ప్ర‌ధాని మోడీ చేసిన అభివృద్ధిని వివ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును ఉడికిచేందుకు అమిత్ షా ఏపీకి రాక‌పోతారా..? వ‌చ్చిన త‌రువాత మాతో క‌ల‌వ‌క‌పోతారా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నార‌ట‌. అయితే, రాజ‌కీయ కార‌ణాల‌తో జ‌గ‌న్‌ను బ‌హిరంగంగా క‌ల‌వ‌కూడ‌ద‌ని బీజేపీ భావిస్తోంది. ఆంధ్ర‌లో కాపుల‌ను బేస్ చేసుకుని రాజ‌కీయాలు న‌డిపేందుకు పూనుకున్న అమిత్ షా మొద‌ట‌గా ప‌వ‌న్ క‌ళ్యాన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. అందులో భాగంగానే హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భేటీ అయ్యేందుకు డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నార‌ట‌. ఈ భేటీకి సంబంధించిన మ‌రికొన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

Related News